Thursday, March 26, 2026

మాజీపీ .. మాకు కావాలి

  • ఎంపీడీవో కార్యాలయం ముందు గ్రామస్తుల ఆందోళన
  • మా తండాలో కట్టిస్తా అంటే 2 ఎకరాల భూమిని నమ్మి ఇచ్చాం
  • మా తండాలో కాకుండా అతని తండాలో కట్టించాడు

నేటి సాక్షి, నరసింహుల పేట(భూక్యా రవి) : మా జీపీ మాకు కావాలని అని నర్సింహులపేట ఎంపీడీవో కార్యాలయం ముందు గ్రామస్తులు సోమవారం ఆందోళన చేశారు. మండలంలోని గోల్ బొడక తండ గ్రామపంచాయితీలోని బొడక తండ గ్రామస్తులు ఆందోళన చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. గ్రామ మాజీ సర్పంచ్ బాదావత్ సరోజ భర్త కిషన్ బోడక తండాలో గ్రామపంచాయతీ కట్టిస్తానని చెప్పి మాయమాటల చెప్పి మమ్మల్ని మోసం చేశాడని స్థానిక ఎంపీడీవో కిన్నెర యాకయ్యకు వినతి పత్రాన్ని అందజేసినారు. బోడుక తండా గ్రామంలో పెద్దమనుషుల ఒప్పందంతో రెండున్నర ఎకరాల భూమిని బొడక తండావాసులకు చెప్పి గ్రామపంచాయతీ ఇక్కడ కట్టిస్తామని కట్టకుండా మోసం చేశారని ఆరోపించారు. ఆ భూమిలో క్రీడాప్రాంగణం, నర్సరీ, స్మశానవాటిక నిర్మాణం చేపట్టి గ్రామపంచాయతి మాత్రం మాజీ సర్పంచ్ భర్త బాదవత్ కిషన్ తండాలో నిర్మించుకున్నారని వెంటనే నిలిపివేసి బొడకతండలో గ్రామపంచాయితీ గా ఉంచాలన్నారు. ధన్సింగ్ తండాలో గ్రామపంచాయితీ కార్యాలయం కట్టినందుకు అన్ని తండాల ప్రజలు వ్యతిరేకించిన వినలేదన్నారు. ఒక ఎకరం భూమి నుండి 15 గుంటల భూమిని అక్రమంగా మాజీ సర్పంచ్ సరోజ భర్త బాదావత్ కిషన్ పేరుపై ఎక్కించుకున్నాడని ఆ తండావాసులు ఆరోపించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News