నేటి సాక్షి, శంకరపట్నం:
శంకరపట్నం మండలం కొత్తగట్టు రాజీవ్ రహదారి గ్రామపంచాయతీ దగ్గర పల్సర్ బైకు అదుపుతప్పి హుజురాబాద్ మండలం రాజపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ హైమద్ 32 తన వ్యక్తిగత అవసరాల రీత్యా కేశపట్నం వచ్చి తన స్వగ్రామం రాజపల్లి కి వెళుతుండగా మార్గమధ్యంలో కొత్తగట్టు వద్ద బైకు అదుపుతప్పి ఒకసారిగా కింద పడడంతో తలకు తీవ్రమైన గాయం, మోకాలుకు దెబ్బ తగలడంతో రోడ్డు మీద పడ్డాడు. స్థానికులు 108 ఫోన్ చేయడంతో 108 సిబ్బంది ఈఎంటి గూడూరి సతీష్ రెడ్డి, పైలెట్ గోపికృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రునికి ప్రథమ చికిత్స చేసి హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు.




