Thursday, March 26, 2026

“బీమా రంగ భవిష్యత్తును కాపాడండి – ఎల్ఐసి ఏజెంట్ల హక్కులకు మద్దతు ఇవ్వండి!”

  • వైఎస్సార్ కాంగ్రెస్ తిరుపతి ఎంపీ గురుమూర్తి సంఘీభావం

నేటి సాక్షి తిరుపతి న్యూస్ తిరుపతి ప్రతినిధి (డాక్టర్ శివ) : ఎల్ఐసి, ఐఆర్‌డిఏఐ తీసుకువచ్చిన మార్పులు పాలసీదారులు, బీమా పరిశ్రమ, దేశవ్యాప్తంగా 30 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ల జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, భారత జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 19న ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు ఢిల్లీ రామలీలా మైదాన్‌లో శాంతియుత ప్రదర్శన నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో సమాఖ్యకు చెందిన ప్రతినిధులు తిరుపతి పార్లమెంటు సభ్యులు మద్దిల గురుమూర్తిని కలిసి వినతిపత్రం అందజేసి, శాంతియుత ప్రదర్శనకు మద్దతు తెలపాలని కోరారు. ఈ సందర్బంగా తిరుపతి ఎంపీ శ్రీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ, గతంలో కూడా ఎల్ఐసి ఏజెంట్ల సమస్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంటులో ప్రస్తావించిన విషయం వారికీ గుర్తుచేశారు. ఢిల్లీలో నిర్వహించనున్న శాంతియుత ప్రదర్శనకు తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంటులో ప్రశ్నిస్తానని హామీ ఇచ్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News