- కమలాపూర్ కు చెందిన చేరాల సిరి సహస్ర
- అభినందనలు తెలిపిన కుటుంబ సభ్యులు
నేటి సాక్షి, కమలాపూర్ (నాగరాజు పటేల్ ఎడ్ల) : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన చేరాల సిరి సహస్ర ఇవాళ వెలుబడిన సిఏ ఫలితాల్లో ఆల్ ఇండియా లెవెల్లో 35వ ర్యాంకు సాధించింది.ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది జనవరిలో సీఏ ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించగా కమలాపూర్ కు చెందిన చేరాల రాజ్ కుమార్ – సరస్వతి దంపతుల కుమార్తె చేరాల సిరి సహస్ర పరీక్షలకు హాజరై సీఏ ఇంటర్మీడియట్ బోత్ పరీక్షల్లో ఆల్ ఇండియా స్థాయిలో 35వ ర్యాంకు సాధించి ఔరా అనిపించింది.అంతే కాకుండా గతములో రాసిన ఇంటర్మీడియట్ పరిక్షల్లోనూ సిరి రాష్ట్ర స్థాయిలో మెదటి ర్యాంక్ సాధించింది.సిరి సహస్రకు ఆలిండియా 35వ ర్యాంకు రావడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలుపి కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.కాగా బంధువులు స్నేహితులు సిరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.




