నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) ఆధ్వర్యంలో మంగళవారం గూడూరు డివిజన్ లోని చింతవరం పిహెచ్ సి పరిధిలో గల తొనుకుమాల, చేడిమాల గ్రామాల్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో రెండు పింక్ బస్సుల ద్వారా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతోంది. బిపి, షుగరు పరీక్షలతోపాటు పింక్ బస్సులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్ స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మహిళలు, పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. కాగా, చింతవరం పిహెచ్ సి పరిధిలో మార్చి 4న చేడిమాల, తొనుకుమాల, మార్చి 6న తిక్కవరం, ఏరూరులో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో పిహెచ్ సి వైద్యాధికారులు డాక్టర్ బి.పాల్ జాన్సన్, డాక్టర్ సుమ, స్విమ్స్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ పద్మావతి, డాక్టర్ హరిత, సర్పంచులు త్రివిక్రమ్ భూపతిరావు, కొల్లూరు పద్మ, పంచాయతీ కార్యదర్శులు నాగూరయ్య, సిరాజ్, స్థానిక నాయకులు భాస్కర్, కుమార్, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు రెడ్డి, పిహెచ్ ఎన్ కోటేశ్వరమ్మ, సూపర్వైజర్ సురేష్, ఎంఎల్ హెచ్ పిలు జి.కావ్య, జె. క్రాంతి రేఖ, ఏఎన్ఎంలు ఎం.కాంతమ్మ, అంకమ్మ, స్థానిక వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.




