నేటి సాక్షి, కొడిమ్యాల : పూడూరు రైతు వేదిక లో ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమం వీడియో కాన్ఫారెన్స్ జరిగింది. వివిధ పంటలలో మేలు రకం విత్తనాల ఎంపిక, యసంగి తీగజాతి కూరాగాయాల సాగు లో యాజమాన్య పద్ధతుల గురించి మరియు పశు సంపద – పశు జాతుల అభివృద్ధి గురించి శాస్త్రవేత్తలు వివరించడం జరిగింది. ప్రతి మంగళవారం జరిగే రైతు నేస్తం కార్యక్రమంలో రైతులు తమకున్న సందేహాలను నేరుగా శాస్త్రవేత్తలతో అడిగి తెలుసుకునే అవకాశం కలదు. దీనిలో మండల వ్యవసాయ అధికారి పి జ్యోతి, ఏఈఓ లు రాజేష్,శ్రీలత,గ్రీష్మ, రావేప్ విద్యార్థినిలు (వ్యవసాయ కళాశాల – సిరిసిల్ల ) మరియు రైతులు పాల్గొన్నారు.




