Thursday, March 26, 2026

ఖాతాదారుల సేవే ఎస్.బి.ఐ లక్ష్యం

  • రాయికల్ ఎస్.బి.ఐ మేనేజర్ పవన్ కుమార్

నేటిసాక్షి, రాయికల్: ఖాతాదారుల వినియోగదారులకు సేవ చేయడమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్యమని రాయికల్ బ్రాంచి మేనేజర్ పవన్ కుమార్ అన్నారు. రాయికల్ మండలంలోని ఇటిక్యాల ఉన్నత పాఠశాల లలో మంగళవారం ఉపాధ్యాయ బృందం తో బ్యాంకు పక్షాన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్.బి.ఐ ఖాతాదారుల కు ప్రవేశ పెడుతున్న పలు పథకాలపై అవగాహన కల్పించారు. సంవత్సరానికి రెండు వేలతో నలభై లక్షల ప్రమాద భీమా సౌకర్యం కలదని, పర్సనల్, హౌసింగ్ తదితర లోన్స్ ఆలస్యం లేకుండా సంబంధిత రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్ల ఆధారంగా వెంటనే రుణాలు మంజూరి చేస్తామని, డెబిట్ కార్డు లతో కూడా గల లాభాలను తెలిపారు. హైదరాబాద్ హైడ్రా కూల్చివేత లో ఎస్.బి.ఐ లోన్ మంజూరు చేసిన ఏ ఒక్క ఇల్లు కూడా కూల్చబడలేదని అంత క్షుణ్ణంగా పరిశీలించి భవిష్యత్తులో కూడా వినియోగదారుడికి నష్టం జరుగకుండా ఎస్.బి.ఐ జాగ్రత్త వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు సీమలదారి సదాశివ్, ఆర్.యు.పి.పి.టి రాష్ట్ర శాఖ సహాధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్, గాజెంగి రాజేశం, బ్యాంకు ఎఫ్.వో హరికృష్ణ, రాజ్యలక్ష్మి-శివకుమార్, ఎద్దండి రమేష్ రెడ్డి, హన్మంతరావు, జియావుద్దీన్, ముజాహిద్, నాగలక్ష్మి, స్వర్ణలత, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News