నేటిసాక్షి చేర్యాల: కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి దర్శనానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మంగళవారం ఉదయం కుటుంబ సమేతంగా రాగా జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి, కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ అనురాధ, గజ్వేల్ ఆర్డిఓ చంద్రకళ వేరువేరుగా పుష్ప గుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అలాగే ప్రభుత్వ లాంఛనాల ప్రకారం పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. తదుపరి శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుని పట్నం వేసి మొక్కలు చెల్లించుకున్నారు.అనంతరం జగదేవ్పూర్ మండలంలోని కొండపోచమ్మ ఆలయాన్ని చేరి కొండపోచమ్మ అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గొల్ల కురుమలు గవర్నర్ ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్థానిక బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




