Thursday, March 26, 2026

రైతులకు 24 గంటలు కరెంటు ఇవ్వాలి

  • బిఆర్ఎస్ జిల్లా నాయకులు బండారి సునంద్

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : జోగులాంబ గద్వాల్: జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు బండారి సునంద్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గద్వాల జిల్లా ప్రాంతంలో కరెంటు అన్ని మండలాలలో 12 గంటలు మాత్రమే వస్తుంది కానీ వేసవికాలం కాబట్టి రైతులకు 24 గంటలు కరెంటు ఇవ్వడం వలన రైతులు పంటకు నీళ్లు అందే అవకాశం ఉంది.కాబట్టి 24 గంటలు కరెంటు వెంటనే రైతుకు అందజేయాల్సిందే ఈ ప్రభుత్వంలో ఈ రైతు గోస ఏందో ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి తెలియాల్సిందే ఎందుకనగా కాలువల కైతే నీళ్లు ఎలానో లేవు మరి కరెంటు కూడా లేకపోతే బోర్లులో నుండి ఏ విధంగా నీళ్లు వస్తాయో ఒకసారి పునర్ ఆలోచన చేసుకోవాలి. వెంటనే రైతుకు 24 గంటల తక్షణమే కరెంటు ఇవ్వవలసిందిగా బీఆర్ఎస్ జిల్లా నాయకులు బండారి సునంద్ డిమాండ్ చేస్తా ఉన్నారు.ఈ వేసవి కాలంలో నీళ్లు ఇబ్బంది ఉన్నది కావున వెంటనే రైతులకు 24 గంటలు కరెంటు ఇవ్వాల్సిందే అని అన్నారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చేవారు కాబట్టి రైతు మూడు సీజన్లో పంట సులభంగా పండించుకునేవాడు ఇప్పుడు రెండు సీజన్ల కంటే ఎక్కువ పండించలేక పోతున్నాడు ప్రజాపాలనలో రైతుకు గోసనే మిగిల్చింది కానీ రైతు రాజుగా కావడం చూడలేదు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రజా పాలన కాదు రైతు ఆత్మహత్య చేసుకునే పాలన అని అన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News