నేటి సాక్షి, మెట్ పల్లి రూరల్ : ఎల్లమ్మ దేవాలయంలో భక్తుల సౌకర్యాలకు అధిక ప్రాధాన్యం ఇస్తునామని దేవాదాయ శాఖ జగిత్యాల డివిజన్ పర్యవేక్షకులు ఎం.రాజమొగిలి అన్నారు.మెట్ పల్లి మండలం వెల్లుల్ల ఎల్లమ్మ దేవాలయంలో దేవాదాయ శాఖ వారి ఆధీనంలో మంగళవారం సాయంత్రం హుండీ తెరిచి లెక్కించరు.హుండీల ద్వారా వచ్చిన ఆదాయం రూ.నాలుగు వేయిల ఐదు వందల ఏనబై ఐదు రూపాయలు మరియు వివిధ సేవా టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.ముప్పే ఐదు వేయి తొమ్మిది వందల రూపాయలు మొత్తం కలిపి నలబై వేల నాలుగు వందల ఏనబై ఐదు రూపాయలు వచ్చాయి. మరియు మిశ్రమ వెండి 15 మిల్లీ గ్రాములుగా వచ్చినది. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి కే.కాంత రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.




