నేటి సాక్షి, కొడిమ్యాల : సోల్జర్ కి గన్ను ఎంత ముఖ్యమో స్టూడెంట్ కి పెన్ను అంతే ముఖ్యం అనే నినాదంతో చిలుకూరి బాలాజీ ఆలయంలోని శివాలయ ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మారాం మహరాజ్ సహకారంతో తేదీ 4/03/2025 మంగళవారం రోజున ఉదయం పది గంటలకు కొడిమ్యాల మండల కేంద్రములోని జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో మోడల్ స్కూల్. పూడూరు ప్రభుత్వ పాఠశాలలో పెన్నుల పంపిణీ చేశారు. బూట్ల రాజమల్లయ్య అధ్యక్షతన తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ద్వారా పదవ తరగతి చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం,పరీక్షలకు సూచనలు సలహాలు ఇచ్చిఅనంతరం ఉచితంగా పెన్నుల పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ వూట్కూరి శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు ఇజ్జగిరి శ్రీనివాస్, మొగిలిపాలెం శ్రీనివాస్, బూట్ల రాజమల్లయ్య, కొండూరి సురేష్, చెన్న దేవేందర్, బల్ల చిన్న అంజయ్య, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.




