Thursday, March 26, 2026

రైతులను మోసం చేస్తున్న మొక్కజొన్న డీలర్స్

  • రైతుల గోస పట్టించుకోని అధికార యంత్రాంగం
  • వాజేడు మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు చెన్నం స్వామి మాదిగ

నేటిసాక్షి /వాజేడు : బహుళ జాతి కంపెనీ యొక్క జొన్న పంట వేసి పూర్తిగా నష్టపోయామని వాజేడు మండలం కొంగాల పంచాయతీ పరిధిలోగల రైతులు మొక్కజొన్న పంట వేసి పూర్తిగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు పొడపాటి ఆదిలక్ష్మి,ఇల్లెందుల వేణుబాబు,లేగల నాగేశ్వరరావు. మాడుగుల నరసింహారావు, లేగల పెదబాబు,గగ్గూరి సంజీవరావు,ఇల్లెందుల చిరంజీవి మంగళవారం పంట నష్టాన్ని పరిశీలించిన వాజేడు మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు చెన్నం స్వామి మాదిగ అనంతరం వారు మాట్లాడుతూ కొంగాల పంచాయతీ పరిధిలోని ఎకరానికి నాలుగు టన్నులు దిగుబడి వస్తుందని మాయమాటలు చెప్పి హైటెక్ కంపెనీల వెంకటాపురం మండలానికి చెందిన డీలర్ తో మాట్లాడి పంట సాగు చేశారు అన్నారు ఆరు కాలం కష్టపడి రైతులు పంట సాగు చేస్తే గింజ కూడా పోసుకోలేదని అన్నారు దిగుబడి రాకపోవడం వల్ల మొక్కజొన్న రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారని తెలియజేశారు. ఈ విషయంపై గత వారం రోజుల క్రితం మండల ఏఈఓ రాధిక పరిశీలించి రైతుల దగ్గర నుండి దరఖాస్తులు తీసుకున్నప్పటికీ నాలుగు ఎకరాలు చేసిన రైతుకి అర ఎకరం నష్టపరిహారం కింద పరిగణంలోకి తీసుకోవడం సరి కాదని వారన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి మొక్కజొన్న పంట నష్టపోయిన రైతులకు పూర్తి నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్పి మండల అధ్యక్షుడు పేట సమ్మాలు మాదిగ, ఎమ్మార్పీఎస్ వాజేడు మండల వైస్ ప్రెసిడెంట్,లేగల రవి మాదిగ,కార్యదర్శి మాడుగుల జ్యోతి ప్రసాద్ మాదిగ,కేసరి రాజు మాదిగ,మండల ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు లేగల.ప్రవీణ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News