- సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మoడ్ల భాస్కర్
నేటిసాక్షి, గన్నేరువరం (బుర్ర అంజయ్య గౌడ్): ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కొమరయ్య గెలుపుకు కృషిచేసిన సిపిఎస్ ఉద్యోగులందరికీ సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మoడ్ల భాస్కర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం గన్నేరువరం మండలం లోని గుండ్లపల్లెలో విలేకరులతో మాట్లాడుతూ కరీంనగర్, ఆదిలాబాద్,నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని సిపిఎస్ ఉద్యోగులంతా ఏకతాటిపై ఉండి గెలుపులో పాలుపంచుకోవడం అభినందనీయమని అన్నారు. కరీంనగర్ నియోజకవర్గ చరిత్రలో మొదటి ప్రాధాన్యత ఓటుతో విజయాన్ని కైవసం చేసుకుని మునుపెరుగని చరిత్రలో నిలిచిపోయారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మల్క కొమురయ్య గెలుపుతో సిపిఎస్ ఉద్యోగులంతా ఆనందమయంలో మునిగిపోయారని అన్నారు. గెలుపులో పాలుపంచుకున్న సిపిఎస్ ఉద్యోగుల తో పాటు ఉపాధ్యాయులందరికీ టిసిపిఎస్ఈఏ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.




