నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : మంగళవారం రోజున వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం లోని హసన్ పర్తి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ వర్కర్స్ కి షేర్ ఎన్ జి ఓ ఆధ్వర్యం లో నిర్వహించిన బాలల హక్కులు, వివాహ చట్టాలు పైన అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అవగాహణ సదస్సు లో (జస్ట్ ఫర్ రైట్స్ చిల్డ్రన్) హనుమకొండ షేర్ ఎన్జీవో సి ఎస్ ఎం ఆర్. జమున మాట్లాడుతూ బాలలు ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా బాల్య వివాహాలు, బాల కార్మికులు, బడి మానేసిన పిల్లలు, బాలల పై లైంగిక వేధింపులు మరియు అక్రమ రవాణా మొదలగు సమస్యలు వాటి పరిణామాలు వివరించారు. వాటికీ సంబంధించిన చట్టాలను పిల్లలకు వివరించి, పిల్లలు అన్ని రంగాలలో ముందు ఉండాలని చదువు పైన ఇష్టం పెంచుకొని ఆ దిశగా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. బాలలకు హక్కులను అనగా జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, పాల్గొనే హక్కు, అభివృద్ధి చెందే హక్కులను వివరిస్తూ బాధ్యతలను గురించి వివరించారు. హక్కుల కు భంగం కలిగి నప్పుడు బాలలకు ఉన్నా చట్టాల ద్వారా రక్షణ పొందాలని, టోల్ ఫ్రీ నెంబర్ 1098 కి కాల్ చెయ్యాలని చెప్పారు. సి ఎస్ ఎం జగన్ మాట్లాడుతూ పిల్లలు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని, అపరిచితులను నమ్మవద్దు అని తెలిపారు. ఈ కార్యక్రమం లో షేర్ ఎన్ జి ఓ ప్రతి నిధులు జమున, జగన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్స్ కృతిక రెడ్డి, ప్రహసీత్, భరత్ రెడ్డి, భార్గవి, విజయ రెడ్డి, మానస, సాయి శ్రీ, మెవినా, రుతమ్మ మరియు ఆశ వర్కర్స్, ఏఎన్ఎం లు పాల్గొన్నారు.




