Thursday, March 26, 2026

పేదల ఆరోగ్య పెన్నిధి.. ముఖ్యమంత్రి సహాయ నిధి..

నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి ( కోక్కుల వంశీ ) : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలనే ఉద్దేశంతో సీఎం ఆర్ ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమని రుద్రంగి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్ జలపతి, మార్కెట్ కమిటీ డెరైక్టర్ కొమ్ముల రవీందర్ రెడ్డి అన్నారు. మంగళవారం రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన దర్శనం భూధవ్వ కు రూ. 60.000/- ,గైదిగుట్ట తండాకు చెందిన లౌడ్య దివ్యకు రూ. 31000/- చెక్కులను స్థానిక నాయకులతో కలిసి వారికి అందజేశారు. ఈ సందర్భంగా తూ జలపతి, కొమ్ముల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ…కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన నిరుపేదల కోసం ఎంతగానో కృషి చేస్తుందని, ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసి మాట నిలుపుకుంటుందని అన్నారు. ఇటు మానాల మోహన్ రెడ్డి తో అటు వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ సహకారంతో మానాల గ్రామాన్ని మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతామని కొమ్ముల రవీందర్ రెడ్డి తెలిపారు. సహాయ నిధికి మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు, రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ పక్షాన లభిదారుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొమ్ముల రవీందర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు జూల దిలీప్, తూము రవీందర్, జక్కు మోహన్, లింగారెడ్డి, జక్కుల లక్ష్మీ నర్సయ్య, అంగరాకుల మహేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News