Thursday, March 26, 2026

సింగరేణి ఆధ్వర్యంలో మహిళలకు ఆటల పోటీలు

నేటి సాక్షి, మందమర్రి:- అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పట్టణంలోని సిఈఆర్ క్లబ్ లో సింగరేణి ఆధ్వర్యంలో మహిళలకు మంగళవారం ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏరియా సేవా అధ్యక్షురాలు జి స్వరూప దేవేందర్ ముఖ్య అతిథిగా హాజరై, ముందుగా మహిళలందరికీ ముందస్తు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, అనంతరం పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు గ్లాస్ బాల్, బాల్ స్ట్రా, గ్లాస్ ఇన్ హెడ్, బాంబ్ ఇన్ బ్లాస్ట్ తదితర పోటీలు నిర్వహించగా, పోటీలలో ఏరియాలోని సుమారు 200 మంది మహిళలు, సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవా అధ్యక్షురాలు స్వరూప దేవేందర్ మాట్లాడుతూ, ఈ పోటీలో గెలుపొందిన మహిళలకు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలలో బహుమతి ప్రధానోత్సవం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్యూనికేషన్ సెల్, సేవా సమితి కోఆర్డినేటింగ్ అధికారి, డివైపిఎం ఎండి అసిఫ్, మహిళా ఉద్యోగులు, సేవా సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News