నేటి సాక్షి, మందమర్రి:- తెలంగాణ మాదిగ హక్కుల దండోరా (టిఎంహెచ్డి) జిల్లా అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన పల్లె సమ్మయ్య బాబు నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జన్ను కనకరాజు, రాష్ట్ర అధ్యక్షుడు కోరిపల్లి శ్రీనివాస్ లు సమ్మయ్య బాబుకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జిల్లాలో సంఘాన్ని బలోపేతం చేస్తూ, వర్గీకరణ కోసం జరిగే పోరాటంలో ముందుంటూ, అగ్రభాగాన మాదిగ జాతిని నిలిచేలా, మాదిగ జాతి విముక్తి కోసం ముందుండి, పోరాడాలని సూచించారు. అనంతరం జిల్లా నూతన అధ్యక్షుడు పల్లె సమ్మయ్య బాబు మాట్లాడుతూ, తనపై నమ్మకంతో పదవీ బాధ్యతలు అప్పగించిన సంఘం రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణ సాధించేవరకు మాదిగ జాతి ఐక్యత కోసం, అభివృద్ధి కోసం పాటుపడతానన్నారు. జిల్లాలో సంఘాన్ని బలోపేతం చేసి, జాతి హక్కుల కోసం నిరంతరం పోరాడతానని తెలిపారు.



