Thursday, March 26, 2026

జర్నలిస్ట్ లపై అక్రమ కేసులు పెట్టించడం కొమ్మూరి తగదు

  • సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి విమర్శ

నేటిసాక్షి చేర్యాల: జర్నలిస్ట్ లను తన అనుచరులతో, పార్టీ కార్యకర్తలతో అక్రమ కేసులు పెట్టించి పోలీస్ అధికారులతో బెదిరించడం జనగామ జిల్లా డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కి తగదని సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్థానిక చేర్యాల సీపీఎం పార్టీ కార్యాలయం లో మంగళవారం ముఖ్య కార్యకర్తల సమావేశం లో ఆముదాల మల్లారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే జర్నలిస్టులపై రాష్ట్రo లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందనే అహంతో చేర్యాల పోలీస్ యంత్రాగాన్ని ఉపయోగించుకొని అక్రమ కేసులను పెట్టి జర్నలిస్టులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ధ్వజమెత్తారు. చేర్యాల పోలీసు యంత్రాంగం అధికార పార్టీ నాయకులకు తొత్తు పలుకడం సమాజసం కాదని పేర్కొన్నారు. ఇటీవల చేర్యాల ప్రాంతానికి చెందిన జర్నలిస్టు గణేష్ తివారిపై అక్రమ కేసు పెట్టించే ప్రయత్నమే కాకుండా పోలీసు అధికారుల నుంచి గణేష్ ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. బేసరత్తుగా అతనికి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, పిటిషన్ దారుడు క్షమాపణ చెప్పాలని అన్నారు. చేర్యాల లో ప్రశ్నించే జర్నలిస్టులపై కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అక్రమ కేసులు బనాయించడం ఆనవాయితీగా మారిందని వాటన్నిటిని ప్రజలు గమనిస్తున్నారని రాబోవు కొద్ది రోజుల్లో సరైన గుణపాఠం చెబుతారని మల్లారెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు కలిసి రావాలని ఆయన కోరారు. ఇకనైనా పోలీస్ అధికారులు పద్దతి మార్చుకొని బుద్ధిగా ఉండాలని హితవు పలికారు. జర్నలిస్ట్ లను ఇబ్బందులకు గురిచేస్తే సీపీఎం పార్టీ గా మద్దతు తెలియజేస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చెట్టిపల్లి సత్తిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు కొంగరి వెంకట్ మావో, చేర్యాల మండల కార్యదర్శి బండకింది అరుణ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు రవీందర్, ప్రశాంత్, రజింత్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News