- టిడిపి నాయకులు మౌర్యా రెడ్డి
నేటి సాక్షి రామాపురం మండలం ప్రతినిధి భక్త కుమార్ :
రాయచోటి నియోజకవర్గంలోని ప్రజలు ఎటువంటి సమస్యలతో బాధపడకూడదనే ఉద్దేశంతో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని టిడిపి నాయకులు మౌర్య రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాయచోటి పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో టిడిపి నాయకులు మౌర్యా రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాయచోటి నియోజకవర్గం టిడిపి నాయకులు మౌర్య రెడ్డి మాట్లాడుతూ…. అన్నమయ్య జిల్లాలో ఎక్కువగా భూ సమస్యలు ఉన్నాయని భూ సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని వర్గా ప్రజలు ఎటువంటి సమస్యలతో బాధపడకూడదనే ఉద్దేశంతో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. రాబోయే రోజులలో రాయచోటి నియోజకవర్గాన్ని సమస్యల రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.



