Thursday, March 26, 2026

నీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

  • టిడిపి నాయకులు మౌర్యా రెడ్డి

నేటిసాక్షి రామాపురం మండలం ప్రతినిధి భక్త కుమార్ : రాయచోటి నియోజకవర్గంలో నీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని టిడిపి నాయకులు మౌర్య రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం చిన్నమండెం మండలం టౌన్ లో టిడిపి నాయకులు మౌర్యరెడ్డి నూతన బోరును ప్రారంభించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మౌర్యా రెడ్డి మాట్లాడుతూ….. రాయచోటి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో నీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రస్తుత వేసవికాలంలో ప్రజలకు నీరు సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ప్రాధాన్యత క్రమంలో అవసరమైన ప్రతి గ్రామంలో బోర్లు వేసి పైపులైన్ ల ద్వారా గ్రామాలకు నీటి సరఫరా చేయడం జరుగుతుందన్నారు. రాబోయే రోజులలో నియోజకవర్గంలో శాశ్వత నీరు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News