Thursday, March 26, 2026

అంతర్జాతీయ మహిళా దినోత్సవం -2025 ను పురస్కరించుకుని

నేటి సాక్షి రామాపురం మండలం ప్రతినిధి భక్త కుమార్ : అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, మంగళవారం రోజు ఉమెన్ పోలీసులకు, మహిళా పోలీసులకు కళాశాల విద్యార్థినిలకు పోలీసు అధికారులు సెమినార్ నిర్వహించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా, జిల్లా వ్యాప్తంగా, మహిళా వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా, మంగళవారం రాయచోటి డిఎస్పి గారి కార్యాలయం ఎదురుగా ఉన్న శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో, ఉమెన్ పోలీసులకు, మహిళా పోలీసులకు, కళాశాల విద్యార్థినిలకు, అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ యం. వెంకటాద్రి గారి ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఈ క్రింది 5 టాపిక్ లపై సెమినార్ నిర్వహించారు. అందులో వారికి నచ్చిన టాపిక్ ను ఎంపిక చేసుకొని, ఎంతో ఉత్సాహంగా సెమినార్ లో పాల్గోన్నారు. మహిళలకు డిజిటల్ భద్రత అవసరం, సోషల్ మీడియాలో గోప్యతను రక్షించడం. ఆత్మరక్షణ అవసరం ఒక ఎంపిక కాదు, నాయకత్వంలో ఉన్న మహిళలు సవాళ్లను అన్వేషించండి, నాయకత్వంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళలకు పని ప్రదేశాల భద్రత వేధింపులపై మౌనాన్ని వీడండి, బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రత, సవాళ్లు మరియు పరిష్కారాలు, కార్యాలయాలలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి వ్యూహాలు, మహిళల భద్రతకు భరోసా ఇవ్వడంలో పురుషుల యొక్క పాత్ర.

అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ .యం.వెంకటాద్రి గారు మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, సెమినార్ లో పాల్గొన్న మహిళలను ఎంపిక చేసి, మహిళలకు మొదటి, రెండవ, మూడవ బహుమతులను, మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం రోజున అందజేయడం జరుగుతుందని, ఏదైనా సమస్య వస్తే పోలీసులను ఆశ్రయించాలని, మహిళల భద్రత, రక్షణకు పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. మహిళలు తమ హక్కుల గురించి తెలుసుకొని, వాటిని వినియోగించుకోవాలి. మహిళలపై జరిగే నేరాలను అరికట్టడానికి పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మహిళలు ధైర్యంగా ఉండాలి, ఎలాంటి సమస్య వచ్చినా పోలీసులను సంప్రదించాలి. మహిళా సాధికారతకు ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టింది.
మహిళలు చదువుకొని, ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలి. మహిళలు సమాజంలో అన్ని రంగాల్లోనూ రాణించాలి. మహిళలు తమ పిల్లలకు మంచి విద్యను అందించాలి. మహిళలు తమ పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. మహిళల భద్రతకు పోలీసుల సహాయం కొరకు, డయల్ 100 లేదా 112 కు ఫోన్ చేయడం. సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించడం. మహిళా హెల్ప్ లైన్ నెంబర్ 181 కి కాల్ చేయవచ్చును. లేదా మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో కూడా సంప్రదించాలన్నారు,
మహిళలకు అవగాహన కార్యక్రమాలు ఈనెల 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మహిళా భద్రతలో అన్నమయ్య జిల్లా పోలీసులు జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఎప్పుడూ ముందుటారని పోలీస్ శాఖలో కూడా లింగ వివక్ష పాల్పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మొత్తం 30 మంది విద్యార్థినీలు పై అంశాలపై వారి యొక్క ఉపన్యాసం చేశారు, మిగతా విద్యార్థినీలు చాలా ఆసక్తిగా విన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల సమాజంలో మార్పు వస్తుందని, ప్రతి విషయంలోనూ చర్చించడం వల్ల లింగ వివక్ష లాంటి మహిళా వ్యతిరేక చర్యలు రూపుమాపడానికి ఇలాంటి ఉపన్యాసాలు, కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని, కార్యక్రమానికి వచ్చిన ప్రొఫెసర్లు మేధావులు అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇనస్పెక్టర్, ఐ.రవిశంకర్ రెడ్డి, రాయచోటి పట్టణ ఎస్ఐ బి. శ్రీనివాస్ నాయక్, శ్రీ సాయి కళాశాల యాజమాన్యం, అధ్యాపకుల బృందం, ప్రొఫెసర్లు, మేధావులు, ఉమెన్ పోలీసులు, మహిళా పోలీసులు విద్యార్థినీలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News