Thursday, March 26, 2026

మీ నేస్తం ఆధ్వర్యంలో రక్తదానం

నేటి సాక్షి రామాపురం మండలం ప్రతినిధి భక్త కుమార్ : అన్నమయ్య జిల్లా రాయచోటి అర్చన నర్సింగ్ హోమ్ లో సంబేపల్లి కి చెందిన కేశవ 15 సం అనారోగ్యంతో చేరారు. అకస్మాత్తుగా రక్తం అవసరమని డాక్టర్లు సూచించడంతో వెంటనే రాయచోటి మీ నేస్తం సేవా సంస్థ వ్యవస్థాపకుడు భూపతి యాదవ్ ను ఆమె బంధువులు సంప్రదించడంతో శాతవాహన రెడ్డి ని పిలిపించి బీ పాజిటివ్ రక్తం అందజేశారు. దీంతో బాలుడికి ప్రాణాపాయం తప్పినట్లు వ్యవస్థాపకుడు భూపతి యాదవ్ తెలిపారు. తాము రక్తం అవసరమైన వారికి అన్నివేళలా ముందుండి తమ సంస్థ ద్వారా వీలైనంతవరకు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. రక్తదానం ప్రాణదానం తో సమానం అని యువకులు రక్తదానం చేయడం వల్ల ఇతరులకు ప్రాణదానం చేసినట్లు అవుతుందని ఈ విషయం గమనించి యువకులు రక్తదానం చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో దీపా బ్లడ్ బ్యాంక్ సిబ్బంది వెంకటేష్ పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News