నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్): చందుర్తి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన కుంటల రవి తండ్రి పోచయ్య వయసు 29 అను అతను కరోనా సమయం లో 2020 సంవత్సరం లో ఉపాధి నిమిత్తం ( R4185057 ) నెంబర్ గల పాస్పోర్ట్ పై దుబాయ్ దేశం వెళ్లగా కరోనా కాబట్టి అక్కడ పని లేదు అని ఆ దేశం ఇండియా పంపింది. స్వదేశం కు వచ్చి కూలీ పని చేసుకుంకుంటూ జీవనం సాగిస్తున్నానూ. 2023 సంవత్సరం లో ఆగస్టు నెల 23 వ తేది రోజున ఆ సమయం లో మా పాత ఇల్లు కూలి నిత్యావసర వస్తువులతో పాటు మట్టి తరలిస్తున్న క్రమం లో నా యొక్క పాస్పోర్ట్ కూడా మట్టి లో కలిసి పోయినది. బాధవప్తహృదయం తో తన బాధను చెప్పుకుంటూ విలపించాడు. తర్వాత ఊరిలో ఎలాంటి ఉపాధి లేదు కాబట్టి వేములవాడ లో అద్దెకు ఉంటూ ఉపాధి చేసుకుంటున్నాడు.



