నేటిసాక్షి, సైదాపూర్ : సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట లో భాగంగా యజ్ఞచార్యులు శేషం వెంకటరమణాచార్యుల ఆధ్వర్యంలో గోపూజ యాగశాల ప్రవేశం, ద్వార తోరణ, ధ్వజ కుంభారాధన, అగ్ని ప్రతిష్ట మూర్తి యాత్ర, మూలమంత్ర జప హవనం, విశేష మన్యు సుక్త హవనం, అఖండ దీపారాధన, ప్రతిష్ట మూర్తులకు పంచగవ్య ప్రాసన నిత్య పూర్ణాహుతి, బలిహరణం, అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంగరంగ వైభవంగా గ్రామంలోని మహిళలు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని నూతన వస్త్రాలు ధరించి పిల్లలు పెద్దలు మరియు వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున పాల్గొని పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అన్న ప్రసాద కార్యక్రమం చేయడం జరిగింది.



