Thursday, March 26, 2026

నర్సరీని సందర్శించిన రావిప్ విద్యార్థినిలు

నేటి సాక్షి, కొడిమ్యాల : కొడిమ్యాల మండలం పూడూర్ గ్రామంలో బుధవారం మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పెంచిన నర్సరీని రావీప్ విద్యార్థినులు స్రవంతి , స్పందన, సోనీ, సత్య ,జోష్ణ మాజీ సర్పంచ్ వెలుముల రామరెడ్డి సందర్శించారు. మొదట విద్యార్థినులు నర్సరీలోని మొక్కలకు రోజ్ క్యాన్ తో నీళ్లు అందించారు వచ్చే వర్షాకాలంలో నర్సరీలో నాటుటకు జట్రోఫా, రైన్ ట్రీ , కానుగా, చింత , సీతాఫలం ఉసిరి , సిసో మొదలగు 13,000 మొక్కలను పెంచడానికి అధికారులు నిర్ణయించడం జరిగింది. నర్సరీ బాధ్యులు ఎంపీడీవో- స్వరూప , ఏపీవో-సతీష్ , టెక్నికల్ అసిస్టెంట్ -గౌతమి మరియు ఫీల్డ్ అసిస్టెంట్- మహేందర్ రెడ్డి నేతృత్వంలో ఇటీ మొక్కలు పెంచడం జరిగింది. వీటి రక్షణకై గ్రీన్ షేడ్ నెట్ పందిరి వెయ్యడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News