- నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ( కోక్కుల వంశీ ) : బిఆర్ఎస్ పార్టీకి నాయకురాలు పావని గౌడ్ మంగళవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మరియు ప్రజా పాలన ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ, అసత్య పోస్టులు పెడుతూ ప్రజలను అయోమయాన్ని గురి చేస్తున్న ఆమెపై చర్యలు తీసుకోవాలని వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో మహిళా కాంగ్రెస్ నాయకులు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పట్టణ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట లహరి మాట్లాడుతూ… మా నాయకుడు ఆది శ్రీనివాస్ ఫై తప్పుడు కూతలు కూస్తే నాలుక కోస్తామని అన్నారు. నోరు ఉన్నదని ఇష్టమున్నట్టు మాట్లాడితే సహించబోమని, పావని గౌడ్ నువ్వు చూపించిన కెనాల్ వేములవాడ నియోజకవర్గం సంబంధించిందా,ఎక్కడిదో కెనాల్ చూపించి మా నాయకుడి పైన బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.మా నాయకుడు నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్న ఏకైక నాయకుడు ఆది శ్రీనివాస్ అని వారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూరల శ్రీశైలం, తోట రాజేష్, మిట్ట సంతోష్, మాజీ కౌన్సిలర్ లక్ష్మి నాగభూషణం, మహిళా కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గడ్డం రేణుక, వేములవాడ పట్టణ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చింతకింది లత, పందిళ్ళ రేణుక, తదితరులు పాల్గొన్నారు.



