- అలరించిన విద్యార్థుల నృత్యాలు, ఆట పాటలు
నేటి సాక్షి, సైదాపూర్ : సైదాపూర్ మండలంలోని సోమారం ఆదర్శ మోడల్ పాఠశాలలో బుధవారం ఫేరెవల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పదవ తరగతి విద్యార్థులకు, తొమ్మిదవ తరగతి విద్యార్థులు వీడ్కోలు చెబుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆనందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్. సంపత్ కుమార్ మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో ఉన్నతస్థానాలను అధిరోహించాలని వారికి సూచించారు. పలువురు ఉపాధ్యాయులు తమ అనుభవాలను పంచుకొని, విద్యార్థులకు స్ఫూర్తిదాయక సందేశాలు అందజేశారు. విద్యార్థులు తమ పాఠశాల జీవిత అనుభవాలను పంచుకుంటూ, గురువులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం విద్యార్థుల పాటలు, నృత్యాలు, వినోద కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ బండి కుమార్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.



