Friday, March 27, 2026

అన్నమయ్య జిల్లాఈ సంఘటనపై పుకార్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

నేటి సాక్షి రామాపురం మండలం ప్రతినిధి భక్త కుమార్ : రాయచోటి నియోజకవర్గం అన్నమయ్య జిల్లా మతాలను అడ్డం పెట్టుకోని సంఘ విద్రోహ శక్తులుగా చలామణి అవుతామంటే విడిచిపేట్టే ప్రసక్తే లేదు. అన్నమయ్య జిల్లా యస్పీ విద్యాసాగర్ నాయుడు వీరభద్ర స్వామి పారువేట సందర్భంగా హిందూ సంఘాలు చేరి అనవసర వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా చేశారు. ముస్లింలు కూడా జంక్షన్ వద్ద ఊరేగింపును అడ్డుకోవడంతోపాటు పోలీసులు మమ్మల్ని మోసం చేశారంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరు వర్గాల్లో అకతాయిలు మత పెద్దల మాటలు వినకుండా పోలీసులపై సైతం రెచ్చిపోయారు. దాదాపు 1000 మంది చెప్పులు విసరడం, రాళ్లు రువ్వడం చేశారు. రెచ్చగొట్టిన వారిపైన ఇరు వర్గాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. డ్రోన్ కెమెరాలతో ఆకతాయిలను గుర్తించాం. లాఠీచార్జిలో పోలీసులతో సహా చాలామందికి గాయాలయ్యాయి. ప్రతి ఏడాది హిందూ ముస్లింలు కలిసిమెలిసి వీరభద్ర స్వామి ఉత్సవాలు, ముస్లింల పండుగలు జరుపుకుంటూ వచ్చారు. ఈమధ్య హిందూ, ముస్లిం మత సంస్థలు ఏర్పాటు చేసుకుని పోరాటాల పేరుతో తమ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి వారి వల్ల ప్రశాంత వాతావరణానికి భంగం కలుగుతుంది.
ఇటువంటి వారిపై పిడి యాక్టు లు నమోదు చేస్తాం, జిల్లా బహిష్కరణ చేస్తాం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News