Friday, March 27, 2026

వై యస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులు అందుకున్న జి డి నెల్లూరు ఇంచార్జ్ కృపా లక్ష్మి

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కృపా లక్ష్మి బుధవారం విజయవాడలోని తాడేపల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి జగన్ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సిపి నాయకులు కార్యకర్తలతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించి మన ప్రభుత్వం తిరిగి వస్తుందని ఆమె కు ధైర్యాన్ని ఇచ్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News