- ఫిట్నెస్ కోసం ఓపెన్ జిమ్ లు.. సద్వినియోగం చేసుకుంటున్న యువతి, యువకులు, స్థానికులు
నేటి సాక్షి, సైదాపూర్: సైదాపూర్ యువతి, యువకులకు,స్థానికులకు జిమ్ కు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేయకుండా హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే రవాణ శాఖ మరియు బీసీ సంక్షేమ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ చొరవతో సైదాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొంత సుధాకర్ ఆధ్వర్యంలో వెన్కేపల్లి- సైదాపూర్ గ్రామాలలో ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ లు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరొక్కటి బోత్తలపల్లి రోడ్డు వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి జిమ్ ను సద్వినియోగం చేసుకుంటున్న స్థానికులు ఇటీవలే ఈ జిమ్ లు ఏర్పాటు విషయమై స్థానిక ఎమ్మెల్యే రవాణ శాఖ మరియు బీసీ సంక్షేమశాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



