Friday, March 27, 2026

గల్ఫ్ కార్మికుని చివరి చూపుకోసం శోకసముద్రంలో మునిగిన కుటుంబం

నేటి సాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్): గన్నేరువరం మండలం లోని గునుకుల కొండాపూర్ గ్రామానికి చెందిన లింగంపల్లి మొండయ్య అలియాస్ గత్తర మొండయ్య అతను గత 17 సంవత్సరాలు నుండి సౌదీలోని రియాద్ ప్రాంతంలో ఒక కపిల్ దగ్గర ఇంటిలో పని చేస్తున్నాడు, అతని ఆరోగ్యం గత ఆరు నెలల నుండి బాగు లేకపోవడంతో రియాద్ లోని ఓ ఆస్పత్రిలో అడ్మిట్ యి చికిత్స పొందాడు. ఈ నెల 3 తేదీన తుది శ్వాస విడిచాడు. మొండయ్యకు ఇద్దరు ఆడపిల్లలు ఒక కుమారుడు ఉన్నారు. వాళ్ళ యొక్క బాగోగుల నిమిత్తం బతుకుదెరువు కోసం గల్ఫ్ కు వెళ్లాడు.మృతుడు మొండయ్య కుటుంబం పరిస్థితి ఇల్లు కూడా శిథిలావస్థలో ఉంది. పెళ్లికి ఎదిగిన ఇద్దరు ఆడపిల్లలు ఒక కొడుకు ఉన్నారు.ప్రభుత్వం తక్షణమే అతని యొక్క పార్థివ దేహాన్ని ఇండియాకు రప్పించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి,స్థానిక మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనన్న
లను బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు న్యాలపట్ల శంకర్ గౌడ్ కోరారు. ప్రభుత్వం నుండి ఐదు లక్షల రూపాయలు మృతిచెందిన గల్ఫ్ కార్మికుని కుటుంబానికి ఎక్స్గ్రేషియా అందజేయాలని ఆ కుటుంబాన్ని అన్ని రకాల ప్రభుత్వం ఆదుకోవాలని శంకర్  గౌడ్ తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News