- నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

నేటి సాక్షి ప్రతినిధి రుద్రంగి ( కోక్కుల వంశీ ) : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని రుద్రంగి పోలీస్ స్టేషన్ నిర్మాణానికి రెండు కోట్ల 50 లక్షల నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రుద్రంగి పోలీస్ స్టేషన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయవలసిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరగా వారి ఆదేశాల మేరకు, ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ చొరవతో, డిఐజి, జిల్లా ఎస్పీ సహకారంతో రుద్రంగి పోలీస్ స్టేషన్ నిర్మాణానికి 2 కోట్ల 50 లక్షల రూపాయల నిధులు విడుదల నిధులు మంజూరు చేశారు. నిధులు మంజూరి చేయడం పట్ల ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.



