నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : తిరుపతి అర్బన్ మండలంలోని 2019 సంవత్సరానికి ముందు అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో నివాసం ఉన్న ఇళ్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి అర్బన్ మండలం తాహసిల్దార్ మీడియాకు తెలియజేశారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ భూములైనటువంటి గ్రామ కంఠం, అనాధీనం, పోరంబోకు, గయాలు, పశువుల మేత బీడు వంటి స్థలాలలో ఇల్లు కట్టి నివాసం ఏర్పరుచుకున్న వారికి ఆ ఇళ్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. దరఖాస్తు మహిళా పేరుతో దరఖాస్తు చేసుకుని, దరఖాస్తు తో పాటు నివాసం ఉన్న ఇల్లుకి సంబంధించిన కరెంటు బిల్లు గాని ఇంటి పన్ను గానీ, సంబంధిత పత్రాలు జత చేసి సంబంధిత సచివాలయంలో వీఆర్వో ని సంప్రదించాలన్నారు. దరఖాస్తు అనంతరం క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. 150 గజాల వరకు పేదలకు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుందని, ఆపైన బేసిక్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. కుంట పరంబోకి, చెరువులు, వాగులు, వంకలు ముంపు ప్రాంతాలలో ఆక్రమిత ఇల్లు ఏర్పరచుకున్న వారికి క్రమబద్ధీకరణకు అవకాశం లేదన్నారు.



