Friday, March 27, 2026

ఆహార పదార్థాలలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు

  • జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష

నేటి సాక్షి, మెట్ పల్లి రూరల్ : ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లు హోటల్ లలో ఆహార పదార్థాలలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష అన్నారు. బుధవారం పట్టణంలోని అమృత మిల్క్ సెంటర్ లో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీ లు చేపట్టారు. తనిఖీల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు బయటపడ్డాయి. సామాన్య మధ్యతరగతి ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకొని కొందరు వ్యాపారులు నాసిరకం ఆహార పదార్థాలతో వివిధ రకాల పదార్థాలను తయారు చేసి ప్రజలకు రోగాలను అంటగాడుతున్నారు. బుధవారం మెట్ పల్లి పట్టణంలోని రాజ కళామందిర్ సినిమా టాకీస్ లేడీస్ గేట్ వద్ద ఉన్న అమృత మిల్క్ సెంటర్ లో జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష ఆకస్మికంగా తనిఖీ చేశారు.కల్తీ నెయ్యి, అన్ని రకాల పచ్చళ్ళు వాటిని తయారు చేయడానికి ఉపయోగిస్తున్న కల్తీ పదార్థాలను సీజ్ చేశారు. మిగత కొన్ని పదార్థాలను మున్సిపల్ చెత్త వాహనంలో డంపింగ్ యార్డ్ కు తరలించారు. అమృత మిల్క్ సెంటర్ విక్రయిస్తున్న పదార్థాలు కాలం చెల్లినవిగా గుర్తించారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న అమృత మిల్క్ సెంటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు ఆహార పదార్థాలను కొనుగోలు సమయం లో ఎక్స్పైరీ డేట్ గమనించిన తర్వాతనే కొనుగోలు చేయాలని ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష పేర్కొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News