- కమిటీ ఆధ్వర్యంలో 18 ఏళ్ళుగా ప్రతి మంగళవారం భజనలు
నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు): కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ లో శ్రీ శివరామకృష్ణాలయంలో శ్రీ రామాంజనేయ భజన మండలి కమిటీ వారు గత 18 సంవత్సరాలుగా ప్రతి మంగళవారం క్రమం తప్పకుండా భజన కార్యక్రమాలు నిర్వహిస్తూఉన్నారు. భజన మండలి వ్యవస్థాపకులు దాసారపు కుమార్ 2007 లో హనుమాన్ దీక్షాస్వాముల సహాయ సహకారాలతో ఈ భజన బృందాన్ని స్థాపించారు. నేటికీ సుమారు 80 మంది భజన మండలి సభ్యులు పాల్గొంటూ ఉన్నారు. వీరిలో ప్రతి మంగళవారం 20 మంది సభ్యులు భజన కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ప్రముఖ పుణ్య క్షేత్రాలైన వేములవాడ, భద్రాచలం, యాదాద్రి, కొండగట్టు దేవాలయాలో భజనాకార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. శ్రీ శివరామకృష్ణ భజన మండలి సహకారంతో వీరు ఉన్నత స్థాయిని అధిగమించారు. 2025 ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి పర్వదిరాన్ని పురస్కరించుకొని నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రాలు భద్రాచలం, యాదాద్రి, కొండగట్టులో హనుమాన్ జయంతికి ప్రత్యేక భజన కార్యక్రమాలో పాల్గొనడం జరుగుతుంది. ఈ భజన మండలి గణపతి నవరాత్రి ఉత్సవాలు, దేవి నవరాత్రి ఉత్సవాలుమ, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, శ్రీ కృష్ణాష్టమి, నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వేములవాడలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీరామదాసు భజన మండలి తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు సిద్దేశ్వర్ గారి ఆధ్వర్యంలో పంచాక్షరి మంత్రం వీరి బృందంచే ప్రారంభించడం ప్రత్యేక విశేషం. భీమదేవరపల్లి మండలం కొప్పూరు గద్దలబండ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో మొట్టమొదటిసారిగా భజన కార్యక్రమాలు ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా సింగాపూర్ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో భజనా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కమిటీలో భక్తులు స్వచ్చందంగా చేరి పలు భక్తి కార్యక్రమాలలో భజనలు నిర్వహించి తమ తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు.



