Friday, March 27, 2026

తాపీ మేస్త్రీ సంఘం గౌరవాధ్యక్షుడిగా బండి సదానందం యాదవ్

నేటి సాక్షి, మందమర్రి:– పట్టణ తాపీ మేస్త్రీ సంఘం గౌరవ అధ్యక్షుడిగా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు బండి సదానందం యాదవ్ ను ఎన్నుకున్నారు. పట్టణంలోని సంఘం కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో బండి సదానందం యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నుకొని, శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ నాయకత్వంలో నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ముఖ్యంగా నిర్మాణ రంగంలో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వపరంగా అనేక చర్యలు తీసుకుంటున్నారని, వారికి మరిన్ని అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు. అనంతరం బండి సదానందం యాదవ్ మాట్లాడుతూ, తాపీ మేస్త్రీల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ ల సహకారంతో కార్మికుల హక్కులు, జీవన ప్రమాణాలు మెరుగుపడేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News