Friday, March 27, 2026

అఖిలభారత పద్మశాలి మహాసభను విజయవంతం చేయాలి

  • జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం
  • పద్మశాలి మహాసభ పోస్టర్ ఆవిష్కరన
  • కమలాపూర్ లో చేనేత కార్మికులకు పిలుపునిచ్చిన సంఘ నాయకులు

నేటి సాక్షి,కమలాపూర్ (నాగరాజు పటేల్ ఎడ్ల) : కమలాపూర్ మండల కేంద్రంలోని పద్మశాలి కులస్తుల సమావేశంలో భాగంగా ఈ నెల తొమ్మిదిన హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న అఖిల భారత పద్మశాలి మహాసభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం చేనేత కార్మికులకు, పద్మశాలి కులస్తులకు పిలుపునిచ్చారు.బుధవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం జిల్లా, రాష్ట్ర నాయకులు కార్మికులకు మహాసభల కరపత్రాలు పంపిణీ చేసి పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు కార్మికులు సభకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పద్మశాలి కులస్తుల సమస్యల సాధనకు, చేనేత రంగ అభివృద్ధి, భవిష్యత్తు రాజకీయాలపై నిర్వహిస్తున్న సభకు గ్రామాల్లో నుండి పద్మశాలి కులస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పద్మశాలీల సత్తా చాటాలని, సభకు వెళ్లేందుకు బస్సు సౌకర్యంతో పాటు భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.

  • సీఎలో ఆల్ ఇండియా 35వ ర్యాంకు సాధించిన సిరికి ఘన సన్మానం

అనంతరం కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సిఏ పరీక్షలో ఆల్ ఇండియా 35వ ర్యాంకు సాధించిన పద్మశాలి ముద్దుబిడ్డ చేరాల సిరి సహస్రను పద్మశాలి కుల పెద్దలు ఘనంగా శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తవుటం ఝాన్సీ రాణి రవీందర్, అఖిల భారత పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి వైద్యం రాజగోపాల్, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పోరండ్ల కృష్ణ ప్రసాద్, మండల అధ్యక్షులు బొప్ప శివశంకర్, జిల్లా మీడియా కోఆర్డినేటర్ పులికంటి రాజేందర్, ఉపాధ్యక్షులు వెంగళ వేణుగోపాల్, మెండు రమేష్, దాసి శంకరయ్య, ఆడెపు శ్రీకాంత్, నాసని రాజు, ఆడెపు విజయ, బైరి సహదేవ్, పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News