Friday, March 27, 2026

విద్యాభివృద్ధి కోసం సువెన్ ఫార్మా సేవలు అభినందనీయం

  • సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

నేటి సాక్షి, మునగాల (పాముల రాఘవేందర్) : విద్యాభివృద్ధి కోసం సువెన్ ఫార్మాస్యుటికల్స్ చేసే సామాజిక సేవ కార్యక్రమాలు అభినందనీయం, అమోఘం అని సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సువెన్ ఫార్మా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సి ఎస్ ఆర్ ) లో భాగంగా అక్షర ఫౌండేషన్ ద్వారా సువెన్ ఫార్మా పరిసర ప్రాంత విద్యార్థులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎస్పీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సువెన్ ఫార్మా కంపెనీ ఎన్నో మెడికల్ క్యాంపులు, మంచినీటి సౌకర్యాలను కల్పించిందని వివరించారు. విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థుల పై ఆర్థిక భారం పడవద్దు అనే ఉద్దేశంతో, పేద విద్యార్థులు ఎక్కువగా చదువుకోవాలని సదాశయంతో సామాజిక సేవ కార్యక్రమాల్లో భాగంగా చెక్కుల పంపిణీ చేపట్టడం హర్షనీయమన్నారు. సూర్యాపేట లో షీ టీం, భరోసా సెంటర్ ను సువెన్ ఫార్మా ఏర్పాటును ఎస్పీ గుర్తు చేశారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న సువెన్ ఫార్మా మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలు కూడా చేపట్టడానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. సువెన్ ఫార్మా అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ బాబు మాట్లాడుతూ. సూర్యాపేట పురపాలక సంఘ పరిధిలోని ఉన్నత పాఠశాలలో జాన్యా ఫౌండేషన్ ల్యాబ్ ఇన్ బాక్స్ ద్వారా మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ తదితర విభాగాలలో ప్రయోగాల ద్వారా శాస్త్రీయ విద్యా విధానాన్ని సువెన్ ఫార్మా ఆధ్వర్యంలో అందిస్తున్నామని వివరించారు. అగస్య ఫౌండేషన్ ద్వారా మొబైల్ సైన్స్ ల్యాబ్ తో పాఠాలను ప్రయోగాత్మకంగా ఉన్నత పాఠశాలలో సైన్స్ పట్ల విద్యార్థుల ఆసక్తిని పెంపొందించే విధంగా ప్రయోగాల ద్వారా వివరిస్తూ భవిష్యత్తులో సైన్స్ పై విద్యార్థులు పట్టు సాధించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. మూఢనమ్మకాల పట్ల విద్యార్థులలో చైతన్యం కలిగిస్తున్నామని, శాస్త్రీయ భావనలు పెంపొందించడానికి పలు రకాల కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. సువెన్ ఫార్మా పరిసర ప్రాంతాలలో పేద గిరిజన విద్యార్థులలో డ్రాపౌట్స్ ను తగ్గించి ఉన్నత విద్యను అందించాలని ఉద్దేశంతో పాఠశాల విద్యార్థులకు నగదు పారితోషికంతో పాటు బూట్లు, టైలు, బెల్టులు, బ్యాగులు, నోటు పుస్తకాలు చెప్పారు అందజేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అదనపు ఎస్పి మేక నాగేశ్వరరావు, అక్షర ఫౌండేషన్ వ్యవస్థాపకులు యాస రామ కుమార్ రెడ్డి, సువెన్ సీనియర్ మేనేజర్ వెంకటరమణ, డిప్యూటీ మేనేజర్ సైదులు, ఫెసిలిటీ మేనేజర్ జీవన్ నాయక్, మహేష్, వివిధ ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News