నేటి సాక్షి, గోదావరిఖని (రమేష్).
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చిన్న మైల్ అంజిరెడ్డి ఘన విజయం సాధించిన సందర్భంగా గోదావరిఖనిలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు బిజేపి రామగుండం ఇంచార్జీ కందుల సంధ్యారాణి. ఈ సందర్భంగా కందుల సంద్యారాణి మాట్లాడుతూ… ఈ విజయం పార్టీపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని, అభ్యర్థి చిన్న మైల్ అంజిరెడ్డి. నాయకత్వంలో పట్టభద్రుల అభివృద్ధికి బిజెపి నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై, బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుతూ విజయోత్సాహాన్ని ప్రదర్శించారు. ప్రజలు ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, పార్టీ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్, మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య ,మిట్టపల్లి సతీష్,కోడూరి రమేష్, క్యాతంవెంకటరమణ, పంగ రవి, మామిడి వీరేశం, తోట కుమారస్వామి, అందె రాజకుమార్, దాసరి ఉషాలు, మెరుగు శ్రీనివాస్, బూడిద రమేష్, జక్కుల ప్రవీణ్, కుర్ర రాజేందర్, అంకర్ భరత్, భాషబోయిన వాసు, గంగరాజు, మాదారబోయిన రాకేష్, సాయి పవన్, ఆకాష్, హర్ష, బియ్యల మహేందర్, భాస్కర్, జక్కుల పద్మ, అపర్ణ, గడ్డం శ్వేతప్రియ, పట్టభద్రులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…



