Sunday, March 29, 2026

ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కు విశేష స్పందన

-మార్చి 7 నుంచి వళ్లిపేడు పిహెచ్ సిలో…

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల):
తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) ఆధ్వర్యంలో గురువారం గూడూరు డివిజన్ లోని చింతవరం పిహెచ్ సి పరిధిలో గల ఏరూరు, తిక్కవరం గ్రామాల్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో రెండు పింక్ బస్సుల ద్వారా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతోంది. బిపి, షుగరు పరీక్షలతోపాటు పింక్ బస్సులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్ స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మహిళలు, పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. మార్చి 7 నుంచి వళ్లిపేడు పిహెచ్ సిలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్, మార్చి 7న సిద్దవరం, కొత్తపట్నం, మార్చి 10న వంజివాక, కొక్కుపాడు, మార్చి 11న నెల్లూరుపల్లి కొత్తపాళెం, ఉడతవారిపాళెం. ఈ కార్యక్రమాల్లో పిహెచ్ సి వైద్యాధికారులు డాక్టర్ బి.పాల్ జాన్సన్, డాక్టర్ సుమ, స్విమ్స్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ చైతన్యభాను, డాక్టర్ హరిత, సర్పంచ్ ఒ.సత్యనారాయణ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పద్మజ, బి.సుభాషిణి, స్థానిక నాయకులు పి.ప్రవీణ్ రెడ్డి, యు.శీనయ్య, పిహెచ్ ఎన్ కోటేశ్వరమ్మ, సూపర్వైజర్ సురేష్, ఎంఎల్ హెచ్ పిలు బి.మౌనిక, పి.రంగవేణి, ఏఎన్ఎంలు బి.ఉష, బి.ఉష, స్థానిక వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News