నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) :
గద్వాల్ నియోజకవర్గంలోని కేటి దొడ్డి మండల పరిధిలోనీ తూర్పు తండా గ్రామంలో ఈ స్కూల్లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు టీచర్లుగా ప్రధానోపాధ్యాయులుగా ఎంఈఓ గా కలెక్టర్ గా పాత్రలు పోషించి పిల్లలకు ఉపాధ్యాయులు మాదిరిగా పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా ఎంపీపీస్ ఈ స్కూల్ హెచ్ఎం జయశ్రీ మేడం మాట్లాడుతూ : ఈ స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా నా విద్యార్థులు నా కళ్ళ ముందు ఉపాధ్యాయుల పోస్టులు ఇంకా ఉన్నతమైన పోస్టుల్లో పాత్ర పోషించడం చాలా సంతోషంగా ఉన్నది అని కొనియాడారు అదేవిధంగా ఇది పాత్రకే కాకుండా భవిష్యత్తులో ఇప్పుడు ఏ పాత్ర అయితే పోషించారు అదే పాత్రలో మీరు ఆ విజయాలను చేరుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అని విద్యార్థులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంవీఎఫ్ మొబిలేజర్ మల్దకల్ , వాలంటరీ పార్వతి బాయి, విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.



