
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
ప్రభుత్వ పాఠశాలలోనే క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్య అందుతుందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి అన్నారు మండలంలోని సొరకాయలపాళ్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో గురువారం పదవతరగతి వీడ్కోలు సమావేశానికి, సరస్వతి పూజా కార్యక్రమానికి హాజరై విద్యార్థులను ఆశీర్వాదాలు అందించారు అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 17 నుండి 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తుందని దాన్లో భాగంగా సొరకాయలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి 17 మంది పరీక్షలు వ్రాస్తున్నారని ప్రతి ఒక్క విద్యార్థి ఏకాగ్రత కలిగి చదివిన విద్యను పరీక్షలు వ్రాసి అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు పాఠశాలకు, గురువులకు మంచిపేరు తేవాలని సూచించారు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించారని ఆమె అన్నారు ప్రైవేట్ పాఠశాలల్లో ఇరుకైన గదుల్లో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని అదేవిధంగా అధిక ఫీజుతో తల్లిదండ్రులకు భారంగా మారుతోందన్నారు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించడం ద్వారా విద్యార్థులకు మేధో సంపత్తి పెరుగుతుందన్నారు ప్రభుత్వం పాఠశాల అభివృద్ధికి విద్య ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాల కు ధీటుగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు అనంతరం ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు జయసుధ మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులు వ్యాయామ ఉపాధ్యాయులు కొరతగా ఉందని ఎమ్మెల్యే పులివర్తి నాని దృష్టికి తీసుకెళ్లి పోస్టులను మంజూరు చేయాలని కోరారు స్పందించిన సుధా రెడ్డి త్వరలో సమస్య పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు అదేవిధంగా పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం, ఆవరణలో గార్డెన్ నిర్మాణం నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాలకు ఆరు లక్షల రూపాయలు విలువ చేసే 62 బెంచీలను వితరణ చేసిన దాత ప్రొఫెషనల్ కొరియర్ అధినేత రామినేని బాబు ను అభినందనలు తెలిపారు అనంతరం సుధా రెడ్డి కొంత సమయం వెచ్చించి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ప్రతి విద్యార్థి విద్యను క్రమశిక్షణ ఏకాగ్రత ఎలా అభ్యసించాలి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు వారితో కలిసి ఫోటో దిగారు ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు మేకల తిరుమల రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి పూర్వ విద్యార్ధి చిన్న బాబు, నాయకులు చేకూరి జనార్థన్ చౌదరి,రావిళ్ళ గిరిబాబు, మాధవి తిరుమల రెడ్డి,మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఈ ఉమాపతి నాయుడు,కొట్టే నరసింహా రెడ్డి, సీనియర్ నాయకులు నాధమునియాదవ్, యూత్ నాయకులు జెడి జగన్, కొల్లంగుంట ముని రామిరెడ్డి, మధుసూదన్ రెడ్డి,డిల్లీ నాథ్ రెడ్డి,కొట్టే ధనుంజయ రెడ్డి, రంజిత్ కుమార్ రెడ్డి, వసంత నాయుడు, సాయి రెడ్డి, కిశోర్ రెడ్డి, కె.జగదీష్, వెంకట ప్రసాద్, చంద్రబాబు యాదవ్,పూర్వ విద్యార్ధులు మధుసూదన్, రమేష్, చెంగయ్య,ముని చంద్ర నాయుడు మండల ఉప విద్యాధికారి జయవేలు తదితరులు పాల్గొన్నారు



