- బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
- వనపర్తి టౌన్ ఎస్సై హరిప్రసాద్
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వనపర్తి పట్టణ ఎస్ఐ హరి ప్రసాద్ అన్నారు గురువారం జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన చట్టాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు ఎవరైనా బాల్య వివాహాలు చేసిన ప్రోత్సహించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని ఎస్ఐ తెలియజేశారు. అత్యవసర సమయంలో బాలల కోసం ఏర్పాటుచేసిన చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098, 112, 100 నెంబర్లకు కాల్ చేసి సమాచారం అందించగలరని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా బాల్య వివాహాలకు సంబంధించిన మరియు వివిధ రకాల బాలలకు సంబంధించిన పోస్టర్లను ఎస్ఐ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఔట్రిచ్ వర్కర్ కె నరేష్ మరియు పోలీసు శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



