నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : హన్మకొండ జిల్లా హాసన్ పర్తి మండలం ఎల్లా పూర్ గ్రామంలోని సర్వే నం. 316, 246 చేపల అంగడి భూమిని కాపాడాలని గ్రామ ప్రజలు హనుమ కొండ జిల్లా రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్ కు వినతి పత్రం ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 65 వ డివిజన్ ఎల్లాపూర్ గ్రామం లో సర్వే నంబర్ 316 లో 4 ఎకరాల 15 గుంటల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు కబ్జాచేసి ప్రైవేట్ సర్వేరు తో ప్లాట్లు చేపించి అమ్ముకుంటున్నారని వర్ధన్నపేట నియోజక వర్గం ఎమ్మెల్యే కె. ఆర్ నాగరాజ్ కు తెలిపామని, ఇల్లు స్థలం లేని వారికి అంగడి భూముల్లో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు. సర్వే నెంబర్ 246 లో గల 12 ఎకరాల 13 గుంటల (చేపల ఉత్పత్తి కేంద్రంలో గల కలగిరిబంగళ, గోదాం వీటికి సంబంధించిన హౌస్ లు భూ అక్రమ దారులు పహాని లలో గ్రామ పంచాయతీ చేపల పారం అని రికార్డుల్లో ఉండగా (పహాని) సంబంధించిన శిలా ఫలకాన్ని ఎలాంటి దస్తావేజులు లేకుండా భూ కబ్జాదారులు ఈ భవనాలను (కూల్చివేసి) నేలమట్టం చేశారు. ఇంత పెద్ద భవనాలను కూల్చిన వీరిని ప్రోత్సహించిన వారిపై కేసు నమోదు చేయాలని గ్రామ ప్రజలు ముక్త కంఠంతో విన్నవిస్తున్నారు. మున్సిపల్ అధికారులు, కలెక్టర్ ఈ భూములు కబ్జాకు గురి కాకుండా చూడాలని ఆయా శాఖలకు సంబంధించిన అధికారులకు తెలియ జేసిన లేఖలను పట్టించుకోకుండా నాలా పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ వెంటనే రద్దు చేసి ప్రభుత్వ స్థలంగా బోర్డులు ఏర్పాటు చేయాలని, 1973 వ సంవత్సరం లో సి. సుబ్రహ్మణ్యం కేంద్ర మంత్రి చేపల కేంద్రాన్ని ప్రారంభించారు. ఇట్టి విషయాలను చాలాసార్లు ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని అయినా అధికారులు అక్రమార్కుల పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని హనుమకొండ జిల్లా రెెవేన్యూ అధికారి రాథోడ్ రమేష్ కు తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ భూములను రక్షించాలని వినతి పత్రం అందచేశారు. ఈ కార్య క్రమంలో మోతే, లింగారెడ్డి, నేదునూరి, సునీల్, రేణుకుంట్ల దుర్గాప్రసాద్ మాదిగ, దోమల శ్రీనివాస్, ఎర్ర నాగరాజు, భాషబోయిన కుమార్ యాదవ్ గోపన బోయిన రవీందర్ వాల్మీకి ఎండి షేక్ బాబ్ వెలిసొజు బుచ్చి రాములు మధ్యల తిరుపతి పాల్గొన్నారు.



