- ప్రతిరోజు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటా – కేఎల్ఆర్
నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కృషి వెలకట్ట లేనిది. ఫోర్త్ సిటీ నిర్మాణంలో అంతర్జాతీయ కంపెనీలు, రోడ్లు, డ్రెయినేజీ, మెట్రో కారిడార్, స్కిల్ యూనివర్సిటీ కోసం కెఎల్ఆర్ చేసిన గత ఏడాది కృషి అసమాన్యమైనదని మంత్రి శ్రీధర్ బాబు కొనియాడటం హర్షనీయం. అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సహా ఇతర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మహేశ్వరం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించేలా లక్ష్మారెడ్డి చేశారు. రోజూ మహేశ్వరం నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండి వెంటనే సమస్యలు పరిష్కారించే కిచ్చెన్న.. ఓడిపోయినా… ప్రజా లీడర్ అయ్యారు. గెలిచిన నాయకులు ప్రజల మధ్య లేకపోవడం, ప్రతిపక్షం ప్రశ్రించక పోవటం మధ్య ఉన్న అంతర్గత ఒప్పందాలకు నిదర్శనం. దశాబ్దాలుగా పరిష్కారం కాని జెన్నాయిగూడ భూ రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో మాట్లాడి న్యాయం చేశారు కేఎల్ఆర్. మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు కృతజ్ఞతలు తెలిపారు.



