Sunday, March 29, 2026

డాగ్ షెల్టర్ రూమ్స్ ప్రారంభించిన జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

నేటి సాక్షి, మునగాల : సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖకు నూతనంగా ట్రాకర్ లూసీ, ఎక్స్-ప్లోజీవ్ బ్రూనో అనే రెండు డాగ్స్ ను కేటాయించిన సందర్భంగా సూర్యాపేట జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు నిర్మించిన డాగ్ షెల్టర్ గదులను (జాగిలం గదులు) గురువారం జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ప్రారంభించారు. ముందుగా ఎస్పి కి ట్రాకర్ డాగ్ లూసీ పూలబుకే తో స్వాగతం తెలిపింది. ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ.‌‌ పోలీస్ శాఖ నందు విధుల నిర్వహణ, కేసుల చేదనలో డాగ్స్ (జాగిలం) కు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది అన్నారు. చాలా కేసుల్లో నేరస్తులను పసిగట్టుటలో డాగ్స్ బాగా పని చేశాయని, హంటర్, ట్రాకర్, నార్కోటిక్, ఎక్స్ ప్లోజీవ్ ఇలా ఆరు విభాగాల్లో శిక్షణ పొందిన డాగ్స్ మనకు ఉన్నాయి అన్నారు. ఇప్పుడు కొత్తగా ట్రాకర్ డాగ్ (పేరు లూసీ) ఇది నేర స్థలంలో లభించే ఆధారాలతో నేరస్తులను గుర్తిస్తుందని, మరో డాగ్ ఎక్స్ ప్లోజివ్ (పేరు బ్రూనో) ఇది పేలుడు సామాగ్రిని గుర్తిస్తుంది అన్నారు. బాగా విధులు నిర్వర్తించాలని డాగ్ స్క్వాడ్ సిబ్బందిని ఆదేశించారు. డాగ్ శిక్షణలో ప్రతిభ చూపిన ప్రశంసా పత్రాలను డాగ్ స్క్వాడ్ సిబ్బందికి అందించారు. ఈ కార్యక్రమం నందు అదనపు ఎస్పీ లు నాగేశ్వరరావు, జనార్ధన్ రెడ్డి, ఏఆర్ డి ఎస్ పి నరసింహ చారి, ఆర్ఐ లు నారాయణ రాజు, నరసింహ, డాగ్ స్క్వాడ్ ఆర్ఎస్ఐ రాజశేఖర్, ఆర్ఎస్ఐ సురేష్, కే.అశోక్, ఎం. అశోక్, రెహమాన్, మహేష్, ఏ ఆర్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News