Sunday, March 29, 2026

అక్రమ రవాణా చేస్తున్న యజమానిపై చర్యలు తీసుకోవాలి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : వనపర్తి జిల్లా ఘణపురం మండలం సోలిపూర్ లో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత నిరంతర అక్రమ రేషన్ దందా పై పోలీసుల మెరుపు దాడి బొలెరో లో తరలిస్తున్న బియ్యాన్ని వల పన్ని ఓ స్థానిక రైస్ మిల్లులోనే పట్టుకున్న వైనం రేషన్ బియ్యాన్ని, బొలెరోను పోలీస్ స్టేషన్ కు తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసుల వెల్లడి.అక్రమ పి.డి.ఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న యజమానిపై చర్యలు తీసుకోవాలి. ఘనపూర్ మండలం సోలిపూర్ గ్రామములో సింధు రైస్ మిల్లు యజమాని జిల్లాలో అక్రమ దందా చేస్తూ జిల్లా అధికారులను సంతృప్తి పరస్తూ తప్పించుకోవడం వల్ల రాష్ట్ర సి.సి.ఎస్ సిబ్బంది వలపన్ని రాత్రి 10.30లకు మిల్లుపై దాడి చేసి పి.డి.ఎస్ బియ్యం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది.అధికారులను ప్రలోభపెట్టి ఆ అక్రమ బియ్యం బయట దొరికినట్టు చూపి కేసు నుండి తప్పించుకోవాలని చూస్తున్నారు.ఇది వైరల్ కాకుండా చూసుకొని అధికార పార్టీ నాయకుల అండదండలతో కేసు మాఫీ చేసుకోవాలని చూస్తున్నారు.కాబట్టి విజిలెన్స్ అధికారులు స్పందించి ఇంకా అక్రమ చర్యలను బయటపెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News