
నేటి సాక్షి, మునగాల : మునగాల మండల కేంద్రంలో గురువారం సూర్యాపేట జిల్లా డిఈ ఓ, ఎంఈఓ పాఠశాలలను ఉదయం విద్యార్థుల స్టడీ సమయంలో ఆకస్మికముగా తనిఖీ చేశారు. పాఠశాల ప్రార్థన సమయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవా లంటే బాగా చదవాలని సూచించారు. పాఠశాలలో ఎనిమిదవ తరగతిచదువుతున్న బ్లెస్సీ అను విద్యార్థినిని 2025 సంవత్సరంలో ఇన్స్పైర్ బహుమతి పొందినందుకు షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించారు. మండలంలోని జెడ్ పి హెచ్ ఎస్ ముకుందాపురం పాఠశాలను సందర్శించి . పరిస్థితులను పరిశీలించి ఉపాధ్యాయులకు తగు సూచనలు చేసి విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని విద్యార్థుల కై ఇంటింటి సర్వే చేసి విద్యార్థులను గుర్తించి సంఖ్యను పెంచాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులందరూ ఐక్యంగా పాఠశాల అభివృద్ధిలో పాల్గొనాలని తెలియజేశారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించి పదవ తరగతి ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా మండలంలో ప్రథమ స్థానంలో నిలవడానికి బాగా చదివి జిల్లా స్థాయిలో మంచి పేరు తెచ్చుకోవాలని విద్యార్థులకు సూచన చేశారు.



