Sunday, March 29, 2026

పేదలకు అండగా తపాలా ప్రమాద బీమా

నేటి సాక్షి – కథలాపూర్ (రాధారపు నర్సయ్య) : కథలాపూర్ మండలం కలికోట గ్రామానికి చెందిన మార్కం చిన్న గంగారాం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతను అంబరిపేట్ పోస్ట్ ఆఫీస్ లో టాటా జీఎజీ ప్రమాద బీమా తీసుకున్నారు. సంవత్సరానికి రూ.520 చొప్పున తీసుకోవడంతో, బీమా కింద అతని కుటుంబానికి రూ.10 లక్షలు మంజూరు అయ్యాయి. దీనికి సంబంధించిన చెక్కులను గురువారం మృతుల కుటుంబ సభ్యులకు తపాలా సిబ్బంది కలికోట గ్రామంలో అందించారు.ఈనెల 31 తారీకు వరకు ప్రత్యేక శిబిరాల ద్వారా ప్రతి పోస్ట్ ఆఫీస్ లో ఈ బీమా చూసుకోవచ్చని తెలిపారు.ఈ సందర్భంగా కరీంనగర్ పోస్టల్ బ్యాంక్ మేనేజర్ తొర్తి రాజేష్ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబంలోని అర్హత కలిగిన 18 నుండి 65 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ బీమా చేసుకోవాలని మరణించిన కుటుంబానికి ఆసరాగా ఉంటుందని సూచించారు.పోస్టాఫీసులో ఉన్న ప్రతి పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జగిత్యాల పోస్టల్ ఇనస్పెక్టర్ ఎండీ సఫీయొద్దీన్ సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్పియం గంగరాజు,గ్రామ మాజీ సర్పంచ్ వేముల నారాయణ గౌడ్ , బీపీయం సంపత్, పోస్టల్ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News