Sunday, March 29, 2026

తిరుపతి రూరల్ మండలంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమం

  • మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) తిరుపతి: చంద్రగిరి నియోజకవర్గ తిరుపతి రూరల్ మండలం పరిధిలోని సప్తగిరి కాలనీ పంచాయతీలో ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి మహిళలతో ముఖాముఖి కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మహిళా నేత పులివర్తి సుధా రెడ్డి గారికి పంచాయతీలోని కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు ,మహిళలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమానికి వచ్చిన మహిళలను పులివర్తి సుధా రెడ్డి గారు పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడమే కాక పంచాయతీలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నరు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముందు చూపుతో మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ మరియు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మహిళలకు స్వయం ఉపాధి కింద ఉచిత టైలరింగ్ , స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఉద్యోగాలు, మరెన్నో గొప్ప అవకాశాలు కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. అనంతరం పంచాయతీలలోని సమస్యలను మహిళలను అడిగి తెలుసుకున్నారు. సప్తగిరి కాలనీ పంచాయతీ మహిళలు మాట్లాడుతూ స్వయం ఉపాధి కింద ఉమ్మడి మంగళం పంచాయతీలోని ఐదు పంచాయతీలకు కలిపి ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని పులివర్తి సుధా రెడ్డిని కోరిన మహిళలు…….సానుకూలంగా స్పందించిన పులివర్తి సుధా రెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.అనంతరం సప్తగిరి కాలనీ పంచాయతీలోని డ్రైనేజ్, వాటర్ ట్యాంక్, ఇంటి పట్టాలు, రిజిస్ట్రేషన్, పంచాయతీకి చెత్త సేకరించే ఆటో,ఇతర సమస్యలను దృష్టికి తీసుకొచ్చారు.అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలాగా చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. యుద్ధ ప్రాతిపదికన పరిష్కారమయ్యే పనులను త్వరలోనే పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చిన మహిళ నేత పులివర్తి సుధారెడ్డి.ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News